Mercedes-Benz V-Class: గర్ల్ ఫ్రెండ్ కు రూ. 1.7 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా..!
- హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్‌కు ఖరీదైన గిఫ్ట్
- 1.7 కోట్ల విలువైన Mercedes-Benz V-Class బహుమతి
- జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
- మాహికా శర్మ తన విజయాల్లో కీలకమని పాండ్య వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz V-Class: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ ‘హార్దిక్ పాండ్యా’ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అనేకసార్లు వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా తన గర్ల్ ఫ్రెండ్ మాహికా శర్మపై ఉన్న ప్రేమను చూపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు హార్దిక్ ఓ ఖరీదైన కానుకను తన గర్ల్ ఫ్రెండ్ కు అందించారు. దాదాపు రూ. 1.7 కోట్ల విలువైన సరికొత్త మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ (Mercedes-Benz V-Class) లగ్జరీ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన వాహనాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ మోడల్ కారును హార్దిక్ తన ప్రియురాలికి గిఫ్ట్ గా ఇచ్చాడు.
BRS MLCs Suspended: శాసన మండలి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!
Also Read
కొద్దిరోజుల క్రితమే హార్దిక్ తన కోసం రూ. 12 కోట్ల విలువైన ఫెరారీ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు మాహికాకు ఈ ప్రీమియం కారును గిఫ్ట్‌గా ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట కారుతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యనే పాండ్య నా విజయాల్లో మాహికా పాత్ర ఎంతో ఉందని హార్దిక్ పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, క్రికెట్ మైదానంలోనూ హార్దిక్ పాండ్యా సత్తా చాటుతున్నారు.
Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!
ఇక ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ ఓ ఐపీఎల్ సీజన్ లో తమ తొలి మ్యాచ్ ను గెలవడం ఇదే మొదటిసారి. ఈ గెలుపుతో ముంబై తమ చెత్త రికార్డును చెరిపివేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) మెరుపు హాఫ్ సెంచరీలతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.
Hardik Pandya gifted India’s first Mercedes-Benz V-Class to his girlfriend Mahieka sharma today, and its price is around ₹1.7 crore.🫡 pic.twitter.com/JXdn6dD5Jk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 29, 2026
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?