BRS MLCs Suspended: శాసన మండలి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLCs Suspended: శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేశారు. ఒకరోజు పాటు మండలి నుంచి సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ జరిగింది.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. ఛైర్మన్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సస్పెండ్ అయిన సభ్యుల్లో మధుసూదనాచారి, రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్, వాణీదేవి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం.కోటిరెడ్డి ఉన్నారు.
READ MORE: Bihar: ఎమ్మెల్సీకి నితీష్ కుమార్, ఎమ్మెల్యే పదవికి నితిన్ నవీన్ రాజీనామా
Also Read
- Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
ఇదిలా ఉండగా.. మంత్రి కుటుంబం స్కామ్ బయట పెట్టే వరకు ప్రభుత్వం బిత్తర పోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న(ఆదివారం) అన్నారు. ముఖ్యమంత్రి వాటా ఉన్నందుకు చర్య తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాటలాడారు. అక్రమ మైనింగ్ పై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ చేస్తున్న కంపెనీలో మంత్రి పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వేసిన విచారణ సాఫీగా జరగాలని కోరుతున్నామన్నారు. విచారణ సాఫీగా జరగాలంటే మంత్రి రాజీనామా చేయాలన్నారు. అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని.. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులది ముఖ్యమంత్రి అంటున్నారన్నారు. 2020- 22 వరకు పొంగులేటి ఛైర్మన్ అని తెలిపారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను రేవంత్‌రెడ్డి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. రెండున్నర ఏళ్లుగా ప్రజలకు పనికి వచ్చే ఒక పని కూడా చేయట్లేదని విమర్శించారు. మంత్రిగారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!