NTV Telugu Site icon

Kolkata rape case: మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ..

Kolkata (1)

Kolkata (1)

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ హర్భజన్ సింగ్ ప్రకటన వెలువడింది. బాధితురాలికి న్యాయం చేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భజ్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.

READ MORE: Jani Master: నేషనల్ అవార్డు సాధించిన జానీ మాస్టర్‌కు సన్మానం

హర్భజన్ సింగ్ తన లేఖను ఎక్స్ లో పంచుకున్నాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బెంగాల్ గవర్నర్‌కి లేఖ రాశాడు. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీపడదని… ఈ క్రూరమైన నేరానికి పాల్పడినవారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. ఈ నేరస్థులకు పడే శిక్ష మన సిస్టమ్‌పై విశ్వాసాన్ని పొందేలా ఉండాలని ఆశించారు. ఈ శిక్ష ఇలాంటి విషాదం మళ్లీ జరగకుండా అడ్డుకునేలా ఉండాలన్నారు.

READ MORE:Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి సీబీఐ “సైకలాజికల్ టెస్ట్‌లు” ..

హర్భజన్, మమతా బెనర్జీ, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కి రెండు పేజీల లేఖ రాశాడు. హర్భజన్ తన లేఖలో ఇలా రాశాడు.. ‘ఈ అనూహ్యమైన హింస మనందరి మనస్సాక్షిని కదిలించింది. ఇది వ్యక్తిపై జరిగిన అఘాయిత్యం మాత్రమే కాదు.. మన సమాజంలోని ప్రతి స్త్రీ గౌరవం, భద్రతపై జరిగిన తీవ్రమైన దాడి. ఇది మన సమాజంలో లోతుగా పాతుకుపోయిన సమస్యల ప్రతిబింబం. ఈ ఘటన వ్యవస్థాగత మార్పును మరోసారి తెరపైకి తెచ్చింది. అధికారుల చర్య యొక్క తక్షణ అవసరాన్ని స్పష్టంగా గుర్తు చేస్తుంది.” అని భజ్జీ పేర్కొన్నారు.

READ MORE:Bengaluru: పార్టీ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థిని.. లిఫ్ట్ ఇచ్చి రేప్ చేసిన బైకర్..

‘వారానికి పైగా గడిచింది…’
“ప్రజల ప్రాణాలు కాపాడటానికి సంబంధించిన వైద్య సంస్థ ఆవరణలో ఇటువంటి క్రూరత్వం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటన జరిగి వారానికి పైగా గడిచిపోయింది. ఇంత వరకు ఖచ్చితమైన చర్యలను చూడలేదు. ఇది వైద్యులు, వైద్య సంఘం వీధుల్లో నిరసనకు దారితీసింది. వైద్య సంఘం ఇప్పటికే కఠినమైన పరిస్థితుల్లో కూడా పని చేస్తోంది. వారి స్వంత భద్రత ప్రమాదంలో ఉంది. ఇలాంటి సంఘటనల తర్వాత అంకితభావంతో విధులను నిర్వర్తించాలని మనం ఎలా ఆశించగలం.” అని రాసుకొచ్చారు.