ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ గ్రూప్-ఎలో ఉండగా భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ , శ్రీలంక ఉన్నాయి. భారత్ అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో తలపడనుండగా.. 9న శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది.
Read Also: Mexican: మెక్సికో సైనికుల కాల్పులు.. భారతీయుడి సహా ఆరుగురు వలసదారుల మృతి
గ్రూప్-ఎలో జట్ల గురించి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నప్పటికీ.. ఆస్ట్రేలియా బలమైన జట్టు, ఎక్కడైనా ఓడించడం కష్టం. తాజాగా భారత్‌తో సిరీస్ గెలిచిన తర్వాత శ్రీలంక కూడా పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లు ఉన్నప్పటికీ.. భారత్‌కు ఆస్ట్రేలియా అతిపెద్ద పరీక్ష అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
Read Also: Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ రికార్డ్.. గంటలో ఏకంగా 1.76 లక్షల బుకింగ్స్..
భారత మహిళల జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాల గురించి మాట్లాడిన హర్భజన్ సింగ్.. ‘ఈ టోర్నీని గెలవగల జట్లలో భారతదేశం ఉందని చెప్పాడు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, అద్భుతమైన స్పిన్నర్ దీప్తి శర్మ వంటి అనుభవజ్ఞులైన క్రీడాకారిణులు ఉన్న ఈ జట్టు ఈ టోర్నీని గెలవగలదు. వారు గొప్పగా క్రికెట్ ఆడుతున్నారు. ఇదే జోరును కొనసాగిస్తే టోర్నీని గెలవవచ్చు. భారత మహిళల జట్టు మైదానంలో ఉంటూ బేసిక్స్‌పై దృష్టి పెట్టాలి’ అని హర్భజన్ సూచించాడు. మనసు పెట్టి ఆడాలని, అనవసర ఒత్తిడికి గురికావద్దని చెప్పాడు.