Indian Pitches: ఆ ఆలోచన సరికాదు.. భారత పిచ్‌లపై హర్భజన్ సింగ్ అసహనం!
- స్వదేశంలో టీమిండియా ఆధిపత్యం
- టెస్ట్ సిరీస్ గెలవడం విదేశీ జట్లకు ఓ సవాలు
- విదేశాల్లో ఆధిపత్యం చెలాయించొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పిచ్‌లపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. మనం గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని, కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం సరికాదన్నారు. తొలి రోజు నుంచే స్పిన్ పిచ్‌లను రూపొందించడం వల్ల బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నారు. పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను తయారుచేసి ఆడితే బాగుంటుందని హర్భజన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పేస్‌తో పాటు స్పిన్ పిచ్‌లను తయారు చేయాలని కోరారు.
హర్భజన్ సింగ్ తాజాగా స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ… ‘మనం టర్నింగ్ ఎక్కువగా ఉండే పిచ్‌లు తయారు చేసి ఆడుతున్నాం. భారత జట్టు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను ముగించాలనే ఆలోచన సరికాదు. సాధారణంగా నాలుగో రోజు నుంచి స్పిన్‌కు పిచ్‌లు అనుకూలంగా మారతాయి. ఆ లోపు బ్యాటర్లు పరుగులు చేసేందుకు సమయం ఉంటుంది. ఇప్పుడైతే తొలి రోజు నుంచే స్పిన్ తిరుగుతోంది. దాంతో బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. స్పిన్ పిచ్‌లపై ఏ బ్యాటర్ అయినా సులువుగానే ఔట్ అవుతారు’ అని అన్నారు.
Also Read
Also Read: Suryakumar Yadav: పాపం సూర్యకుమార్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!
‘నాణ్యమైన పిచ్‌లు అంటే పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండాలి. అలాంటి పిచ్‌లపై ఆడితే చాలు. ఇలాంటి వాటిపైన టీమిండియాను ఓడించే సత్తా మరే జట్టుకు లేదు. భారత జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారు. స్పిన్ బలంగా ఉంది. ఐదో రోజైనా మనమే విజయం సాధిస్తాం. మంచి పిచ్‌పై బ్యాటర్లూ పరుగులు చేయగలగుతారు. భారీ స్కోరు చేసినప్పుడే వారి ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది. భారత బ్యాటర్లు స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడతారని నేను అనట్లేదు. పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. విదేశాల్లో మనం ఆధిపత్యం చెలాయించొచ్చు’ అని హర్భజన్ చెప్పుకొచ్చారు. స్వదేశంలో టీమిండియాకు ఉన్నంత ఆధిపత్యం ప్రపంచంలో ఏ జట్టుకు లేదు. భారతదేశంలో టెస్ట్ సిరీస్ గెలవడం మిగతా జట్లకు ఓ సవాలుగా మారింది. ప్రతి జట్టు భారత్ వచ్చి సిరీస్ ఓటమితో తిరిగి వెళుతోంది. భారతదేశంలో పరిస్థితులు ఎల్లప్పుడూ స్పిన్నర్లకు సహాయపడతాయి.
తాజావార్తలు
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?