ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా.. దీనిపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భద్రతాపరమైన సమస్యలు తొలగిపోయే వరకు భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌కు వెళ్లవద్దని భజ్జీ సూచించాడు. హర్భజన్ స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ, “భద్రత విషయంలో ఆందోళన ఉంది. అక్కడ ఆటగాళ్లకు భద్రత లేకపోతే వెళ్లకూడదని అనుకుంటున్నా. టీమ్‌లకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి ఇబ్బంది లేదని చెబితే.. ప్రభుత్వం చెబితే వెళ్లాలి. ఓ క్రికెటర్‌గా క్రికెట్ ఆడాలనుకుంటే ఆడండి. కానీ భద్రత విషయంలో ఆందోళన ఉంది. భద్రత సరిగ్గా ఉందని భావించే వరకు మన ఆటగాళ్లు అక్కడికి వెళ్లకూడదు.” చెప్పాడు.
Asna Cyclone: దూసుకొస్తున్న అస్నా తుఫాను.. గుజరాత్‌కు ఐఎండీ హెచ్చరికలు
పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని బీసీసీఐ చెబుతోంది. 2023 ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లలేదు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్‌ను ‘హైబ్రిడ్ మోడల్’ ఆధారంగా నిర్వహించారు. భారత్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. డ్రాఫ్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం.. సెమీ-ఫైనల్, ఫైనల్‌తో సహా ఇండియా అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లో షెడ్యూల్ చేశారు. కాగా.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మార్చి 1న జరగనుంది.
Bangladesh-India: షేక్ హసీనా వల్ల భారత్‌కు ముప్పు.. బంగ్లాదేశ్కు అప్పగించాలి.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేలా భారత క్రికెట్ బోర్డును ఒప్పించే పనిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కి పిసిబి వదిలేసింది. కొన్ని వారాల క్రితం కొలంబోలో ఐసీసీ సమావేశం జరిగింది. నివేదికల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ బడ్జెట్‌కు సమావేశంలో ఆమోదం లభించింది. ఇదిలా ఉంటే.. ఐసీసీ తదుపరి చైర్మన్‌గా జైషా డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు.