NTV Telugu Site icon

Harassment: బాలికపై వేధింపులు.. క్రషర్లో వేసి హత్యకు పాల్పడ్డ నిందితులు

Up Crime

Up Crime

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని నిరసన తెలిపినందుకు ఓ బాలికను క్రషర్‌లో వేసి హత్యకు పాల్పడ్డారు నిందితులు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. బాగ్‌పత్‌లో.. క్రషర్ యజమానితో సహా ముగ్గురు వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏంటని బాలిక నిరసన వ్యక్తం చేయగా.. ఆమెను క్రషర్‌లోని వేడి నిప్పులలోకి విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బాలిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read Also: New Year 2024: న్యూఇయర్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌, కిరిబాటి.. ఏ దేశంలో ఎప్పుడంటే?

వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు తన కుటుంబంతో సహా ధనౌరా సిల్వర్ గ్రామంలో ఉన్న ప్రమోద్ క్రషర్‌లో కూలీగా పనిచేస్తోంది. బాధితురాలి సోదరుడు బినౌలీ పోలీస్ స్టేషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి క్రషర్‌లో పనిచేస్తోందని చెప్పాడు. క్రషర్ యజమాని ప్రమోద్, రాజు, సందీప్ తన సోదరితో అసభ్యంగా ప్రవర్తించారు. తన సోదరి టీజింగ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో.. నిందితులు కుల సంబంధిత పదాలను ఉపయోగించారు. అంతేకాకుండా.. ఆమెను చంపాలనే ఉద్దేశ్యంతో క్రషర్‌లోకి విసిరారని చెప్పాడు. దీని కారణంగా ఆమె తీవ్రంగా కాలిపోయింది. ఆ తర్వాత ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులకు చెప్పాడు.

Read Also: Ayodhya Ram Mandir: రామమందిరం కూడా పుల్వామా దాడి లాంటి పొలిటికల్ స్టంట్..మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. బాలిక పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను వేధించి నిరసన తెలిపినందుకు క్రషర్‌లోని నిప్పుల్లో పడేసినందుకు నిందితులపై కేసు నమోదు చేశారు. వారిపై 354, 504, 307, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగల కింద కేసు నమోదు చేశారు.