Site icon NTV Telugu

Crime News: తల్లి, సోదరిపై వేధింపులు.. అడ్డుకున్న విద్యార్థిపై దుండగులు కాల్పులు

Haryana

Haryana

హర్యానాలోని పాల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తన తల్లి, సోదరిని వేధిస్తున్న ముగ్గురు దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 10వ తరగతి విద్యార్థిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. పల్వాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికొ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థి లోకేష్‌గా గుర్తించారు.

Read Also: IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. వెనుకంజలో భారత్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం లోకేష్ తన తల్లి, సోదరితో కలిసి పని నిమిత్తం బయటకు వచ్చారు. అయితే.. పని అయిపోయాక ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారికి రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అగంతకులు ఎదురయ్యారు. అగంతుకుల్లో ఓ వ్యక్తి తన చెల్లిని వేధించసాగాడు. దీంతో కోపాద్రిక్తుడైన లోకేష్.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ముగ్గురిలో ఓ వ్యక్తి.. తుపాకీ తీసుకుని లోకేష్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

Read Also: BJP: లోక్‌సభ ఎన్నికల కసరత్తు.. గురువారం 100 మందితో బీజేపీ తొలి జాబితా.!

బుల్లెట్ నేరుగా లోకేష్ చేతికి తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే లోకేష్‌ను తల్లి, సోదరి వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. కాగా.. పోలీసులు ముగ్గురు దుండగుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి బాదరాకు చెందిన కోకన్‌గా గుర్తించారు.

Exit mobile version