NTV Telugu Site icon

Pawan Kalyan Birthday: పవన్‌ కల్యాణ్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన రామ్‌ చరణ్‌!

Ram Charan

Ram Charan

Happy Birthday Pawan Kalyan: నేడు ‘పవర్ స్టార్’ పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు. నేటితో ఆయన 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది. కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు.. పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘మెగా పవర్ స్టార్’ రామ్‌ చరణ్‌ తన బాబాయ్‌కి స్పెషల్ విషెస్ చెబుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మా పవర్‌ స్టార్‌కు శుభాకాంక్షలు అని చరణ్‌ పేర్కొన్నారు.

‘మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బలం, అంకితభావం, అవసరం ఉన్న వారికి మీరు చేసే సాయం నాతో సహా చాలా మందిలో స్ఫూర్తి నింపుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు సామాజిక న్యాయం అందించడం కోసం మీ నిస్వార్థమైన సేవలు, మీ నాయకత్వం, నిబద్ధతతో మీరు చేసే శ్రమ అందరికీ స్ఫూర్తి. దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ మరింత బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్ చేశారు.

Also Read: Pawan Kalyan Birthday: పవన్‌ కల్యాణ్‌ ఫాన్స్‌కు నిరాశ.. అప్‌డేట్స్‌ అన్నీ క్యాన్సిల్!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేయాల్సిన సినిమాలను త్వరలోనే పూర్తిచేయనున్నారు. ఇక ‘గేమ్‌చేంజర్‌’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ వర్క్‌ని రామ్‌ చరణ్‌ ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. ఇక డబ్బింగ్‌ మాత్రమే బ్యాలన్స్‌ ఉంది. అక్టోబర్‌ నుంచి బుచ్చిబాబు సాన సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారు. ఇందుకోసం చరణ్ జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

Show comments