NTV Telugu Site icon

MS Dhoni Birth Day: హ్యాపీ బర్త్ డే మహీ భాయ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన రిషబ్ పంత్

Rishab Pant

Rishab Pant

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, తాజా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అర్థరాత్రి దాటాక సోషల్ మీడియాలో ధోనికి బర్త్ డే విషేష్ వెల్లువెత్తాయి. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్‌ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. తన ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోని 42వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిషబ్ పంత్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Read Also: Estate Dekho: ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా.. ‘ఎస్టేట్ దేఖో’తో మీ కలల ఇంటిని కొనుగోలు చేయండి..

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధోనితో గత పుట్టిన రోజు వేడుకల్లో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు కేక్ కట్ చేసి.. ధోని భాయ్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీరు నా దగ్గర లేకున్నా నేను మీకోసం కేక్ కట్ చేస్తున్నాను అని ఆయన పోస్ట్ చేశాడు. రిషబ్ పంత్‌తో పాటు ఇతర మాజీ క్రికెటర్లు ధోని ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ పుట్టిన రోజు విషేష్ తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు బాహుబలి అంటూ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్టర్ లో పోస్ట్‌ను షేర్ చేశాడు.

Read Also: Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ-బోరుసు లాంటివి.. నీతివంతమైన పాలన తెస్తాం

నాకు ఇష్టమైన మహేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ హార్దిక్ పాండ్యా విష్ చేశాడు. ఎల్లప్పుడు మీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి ధోని భాయ్ అంటూ మహ్మద్ షమీ శుభాకాంక్షలు తెలిపాడు. అదేవిధంగా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ ధోని బర్త్‌డే సందర్భంగా విషెష్ తెలిపారు.