NTV Telugu Site icon

Allu Arjun Birthday: హ్యాపీ బ‌ర్త్‌డే బావ.. అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ హీరో!

Allu Arjun Pushpa 2

Allu Arjun Pushpa 2

NTR Wishes To Allu Arjun: ఈరోజు (ఏప్రిల్‌ 8) ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ బర్త్‌డే. ఉత్తమ నటుడిగా ‘నేషనల్‌ అవార్డు’ అందుకున్న తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో.. ఫ్యాన్స్‌ రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పుష్పరాజ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Happy Birthday Allu Arjun: అల్లు అర్జున్‌కు ఆ హీరోయిన్‌ ఎంతో ఇష్టం!

‘హ్యాపీ బ‌ర్త్‌డే బావ’ అంటూ అల్లు అర్జున్‌కు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బ‌ర్త్‌డే విషెష్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ. ఈ సంవత్సరం మీకు సంతోషం, విజయాలతో నిండలాని కోరుకుంటున్నా’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తుండగా.. ‘దేవర’తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. హృతిక్ రోష‌న్‌ ‘వార్ 2’లో కూడా ఎన్టీఆర్ నటించనున్నారు.

Show comments