తెలంగాణాలో 54 శాతం బీసీలు ఉన్నాం.. ప్రత్యేక మంత్రి శాఖను కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరామని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంత రావు అన్నారు. అయినా, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. బీసీ గర్జన నిర్వహణ కోసం బీసీలను చైతన్యం చేసేందుకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళాను అని వీహెచ్ పేర్కొన్నారు. నేను ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించాను.. బీసీల నుంచి మంచి స్పందన వచ్చింది అని హనుమంతరావు అన్నారు.
Read Also: Kishan Reddy: జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కుల గణన చేస్తామని హామీ ఇచ్చారు అని హనుమంత రావు అన్నారు. రెండుసార్లు ప్రధాని మోడీని కలిసినా ప్రయోజనం లేదు.. నిన్న పీసీసీని భట్టి విక్రమార్క, మధుయాష్కీలను కలిశాను.. సెప్టెంబర్ 6th తర్వాత సభ పెట్టేందుకు సమయం తీసుకోవాలని వారు సూచించారు అని వీహెచ్ తెలిపారు. ఈ బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ముఖ్య అతిధిగా వస్తారు.. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన వెల్లడించారు.
Read Also: Viral Video: రోడ్డు దాటేందుకు పాము కష్టాలు.. చప్పట్లు కొడుతూ సాయం
కాంగ్రెస్ ను చూసి మిగిలిన పార్టీలు కూడా బీసీల వైపు మొగ్గు చూపుతున్నాయి అని వీహెచ్ అన్నారు. సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారు.. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నాం.. కనీసం రెండు లక్షలతో సభ పెడతాం అని హనుమంత రావు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడుకి గన్మెన్లను తొలిగించారు.. జాతీయ పార్టీ నాయకుడికి భద్రత లేకుండా చెయ్యడంలో ఆంతర్యం ఏమిటి.. రాష్ట్రం అంతా తిరిగే మా పీసీసీకి ఏదైనా జరిగితే బాధ్యత ఎవ్వరిది అని వీహెచ్ ప్రశ్నించారు. తక్షణమే నాకు మా పీసీసీ అధ్యక్షుడుకి భద్రత కల్పించాలి అని వి. హనుమంత రావు డిమాండ్ చేశారు.
