Hanuman jayanthi: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు.. ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman jayanthi: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమలలోని అంజనాద్రిపై ఈ నెల 14వ తేదీ(నేటి) నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు అంజనాద్రి ఆకాశ గంగ, జాపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాల వద్ద హనుమజ్జయంతి వేడుకలు జరగనున్నాయి. హనుమజ్జయంతి రోజున ఈ ఆలయాల్లో ఆంజనేయస్వామికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు, నివేదనలు నిర్వహిస్తారు. ఉదయం 7:30 గంటలకు బేడి ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు ఆకాశగంగ ఆంజనేయస్వామివారికి అభిషేకం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు టీటీడి తరపున జాపాలి ఆంజనేయస్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏడవ మైలు వద్ద ఆంజనేయస్వామి వారికి అభిషేకం జరగనుంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు.
Read Also: Hanuman Jayanti: ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల నుంచి ప్రత్యక్షప్రసారం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మరోవైపు హనుమజ్జయంతి సందర్భంగా నేడు పాపవినాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆకాశగంగ, పాపనాశనం ప్రాంతాల వద్ద పార్కింగ్ సమస్య ఉంటుందని.. అందుకే తిరుమల నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు గమనించి, సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!