జపాన్లోని ఫుకుషిమాలోని ఒక పాత ఇంట్లో ఒక విచిత్రమైన మమ్మీ వెలుగుచూసింది. ఇది సగం చేప, సగం మానవుడి లాంటి రూపంలో ఉంది. దీనిని “మెర్మెయిడ్ మమ్మీ” అని పిలుస్తున్నారు. దీనికి కత్తి లాంటి పదునైన పళ్లు ఉన్నాయి. పెద్ద చేతులు ఉన్నాయి. శరీరం కింద భాగం చేప తోక లాగా ఉంది. శరీరం మీద పొలుసులు కనిపిస్తాయి. ఇది ఒక ఎముకలు లాగా కనిపించే మమ్మీఫైడ్ రూపంలో ఉంది.
Also Read:Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరంటే?
ఈ విచిత్రమైన జీవి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది జపాన్ పురాణాల్లోని కప్పా అనే పాత్రకు సంబంధించిన మోడల్ లేదా ప్రతినిధి అని నమ్ముతున్నారు. కప్పా అనేది జపాన్ యోకై (యోకై = అతీంద్రియ జీవులు)లో ఒకటి. ఇవి నీటి దెయ్యాలు లాగా నదుల్లో నివసిస్తాయి. వీటికి పచ్చటి పొలుసులు, మానవుడి లాంటి రూపం ఉంటుంది. కప్పాలు మనుషులను లేదా జంతువులను నీటిలోకి లాగి ముంచేస్తాయని చెబుతుంటారు.
ఇలాంటి “మెర్మెయిడ్” లేదా “నింగ్యో (Ningyo)” మమ్మీలు జపాన్లో గతంలో కూడా కనిపించాయి. కొన్ని పురాతన దేవాలయాల్లో ఉన్నాయి. వాటిని ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం పూజించేవారు. కానీ ఆధునిక పరిశోధనల్లో అవి కృత్రిమంగా తయారు చేసినవి (paper, cloth, fish parts, monkey parts మొదలైనవి కలిపి) అని తేలాయి. ఈ మమ్మీని యోనెజావా సిటీ సిటిజన్స్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. మార్చి 28-29 తేదీల్లో ఓషు రేర్ ట్రెజర్స్ మార్కెట్లో ఆక్షన్లో పెట్టనున్నారు. దీని ధర సుమారు £11,755 (సుమారు రూ.14 లక్షలు) వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read:Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్
జపాన్లో ఇలాంటి కప్పా లేదా మెర్మెయిడ్ మమ్మీలు సుమారు 10 మాత్రమే నిర్ధారణ అయ్యాయని ఈవెంట్ ఆర్గనైజర్ తకేయుకి కిమురా చెప్పారు. ఇప్పటికి ఇది పురాణాల్లోని జీవికి సంబంధించిన మోడల్ అని చెబుతున్నారు. గతంలో ఇలాంటి మమ్మీలు దేవాలయాలకు సందర్శకులను ఆకర్షించడానికి లేదా బౌద్ధ బోధల కోసం తయారు చేసేవారు. పూర్తి శాస్త్రీయ పరిశోధన జరిగితే మరిన్ని వివరాలు తెలుస్తాయి.