Hair Growth Tips : ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం మరియు ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చాలామంది ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ వాడినా ఫలితం ఉండదు. అయితే, ఎటువంటి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతోనే జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? కేవలం మూడు రోజుల్లోనే జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు ఎదుగుదలను రెట్టింపు చేసే ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వాడితే మీరు వద్దన్నా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..
దీని కోసం ఇంట్లో సులభంగా దొరికే బియ్యం, మెంతులు, ఉల్లిపాయల సహాయంతో మీ జుట్టును భయంకరంగా పెంచుకోవచ్చు. ఈ చిట్కాను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.
Also Read
- Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
- Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
- Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
- Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
కావలసిన పదార్థాలు:
1. బియ్యం: 2-3 స్పూన్లు
2. మెంతులు: 1 స్పూన్
3. ఉల్లిపాయ: ఒకటి (మీడియం సైజు)
4.కరివేపాకు: రెండు రెమ్మలు
5. విటమిన్ ఇ క్యాప్సూల్: ఒకటి
తయారీ మరియు ఉపయోగించే విధానం:
ముందుగా బియ్యం మరియు మెంతులను విడివిడిగా నీళ్లలో పోసి రాత్రంతా లేదా కనీసం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం నీళ్లు, మెంతులు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మరియు కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి వచ్చిన జ్యూస్‌లో ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఇ లేకపోతే కొబ్బరి నూనె లేదా ఆముదం కూడా వాడుకోవచ్చు.
ఈ లిక్విడ్‌ను తలస్నానానికి 30 నిమిషాల ముందు మాడకు పట్టేలా అప్లై చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోయి, మూలాల నుండి జుట్టు బలంగా మారుతుంది. కేవలం రెండు మూడు వారాల్లోనే మీ జుట్టులో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. సహజమైన పద్ధతిలో జుట్టు పెరగాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు.
గమనిక: అందరి శరీర తత్వాలు, చర్మ రకాలు ఒకేలా ఉండవు కాబట్టి, ఈ రెమెడీని ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ (Patch Test) చేయడం మంచిది. మీకు ఇప్పటికే జుట్టు లేదా చర్మానికి సంబంధించి తీవ్రమైన సమస్యలు ఉంటే, నిపుణులైన డాక్టర్లను సంప్రదించిన తర్వాతే దీనిని ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!