మొయినాబాద్ యువతి మర్డర్ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. సీఐ రాంబాబుకు మెమో జారీ చేశారు. యువతి మిస్సింగ్ మీద బాధితులు ఫిర్యాదు చేయటానికి రాగా.. ఎస్సై శివ నిర్లక్ష్యం వహించాడు. దీంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. బాకరం గ్రామ పరిధిలో సోమవారం రోజు మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్‌గా (22) గుర్తించారు. సోమవారం (జనవరి 28)న ఇంటి నుంచి ఆటోలో సంఘటన స్థలానికి వచ్చి మధ్యాహ్నం పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
KTR: బీజేపీతో పొత్తు గతంలో లేదు భవిష్యత్తులోనూ ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మృతురాలు చదువు పూర్తి కాగా ఉద్యోగం కోసం వెతుకుతుంది. అయితే.. గతంలో పలుమార్లు రెండు మూడు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడేదని.. అలా రెండుమూడు రోజులు బయటే ఉండి వచ్చేదని అన్నారు. ఈసారి కూడా అలానే వస్తుందని భావించి పోలీస్ స్టేషన్‌లో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తలిదండ్రులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
Tirumala: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం
ఇదిలా ఉంటే.. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు చేధించారు. ఈ ఘటన జరిగిన తరువాత అక్కడ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే.. ఒక ఆటో అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దీంతో ఆటో డ్రైవర్ ను గుర్తించి విచారించారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా.. యువతి తనను డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ దగ్గర దింపాలని అడిగిందని.. అందుకోసం వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి ఆటో ఎక్కినట్లు ఆటో డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. తాను చెప్పినట్టుగా ఆ ప్రదేశంలో దింపి అక్కడి నుంచి వచ్చానని.. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదని అన్నాడు. అయితే యువతి ఆత్మహత్య చేసుకునే ముందు రోజే 5 లీటర్ల పెట్రోల్ తీసుకొని తన ఫ్రెండ్ ఇంట్లో దాచిపెట్టింది. ఆత్మహత్య చేసుకునే రోజు ఉదయం తన వెంట తెచ్చుకోని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.