పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు ముందు దారుణంగా అత్తను హింసించింది కోడలు. అత్తగారు తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా, కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం దుర్భాషలాడడం చేసింది.
Read Also: Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.
పూర్తి వివరాల్లోకి వెళితే… గురుదాస్పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తను… కొడుకు ముందు దారుణంగా కొట్టింది. తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా.. కోడలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా… కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం, తిట్టడం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో కోడలు బాధితురాలి జుట్టును లాగడం, పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. అంతే కాకుండా స్టీల్ గ్లాసులతో కూడా ఆమెను బాదింది. బాధితుడి మనవడు సమక్షంలోనే ఈ దాడి జరిగిందని.. ఆ వ్యక్తి ఈ మొత్తం సంఘటనను తన ఫోన్లో రికార్డ్ చేశాడని తెలుస్తోంది. అతను తన తల్లిని ఆపమని చెప్తున్నప్పటికి.. అవేమీ పట్టించుకోకుండా అత్తను కోడలు కొడుతూనే ఉంది.
Read Also: Floods: డార్జిలింగ్ లో భారీ వరదలు.. విరిగిపడిన కొండచరియలు
వీడియో వైరల్ కావడంతో.. పంజాబ్ మహిళా కమిషన్ ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుని.. గురుదాస్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి లేఖ రాసింది. అనంతరం బాధితురాలిని మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారు. తన కోడలు హర్జీత్ కౌర్ కొంతకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తుందని.. బాధితురాలు గుర్బచన్ కౌర్ తెలిపింది. నాలుగు నెలల క్రితం తన భర్త, రిటైర్డ్ బ్లాక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరణించిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె తెలిపారు. మాట్లాడుతూ, తన తల్లి తాగుబోతు అని.. తన నానమ్మ, తండ్రి ఇద్దరిపై తరచుగా దాడి చేస్తుందని బాధితుడి మనవడు, వీడియో చిత్రీకరించిన చరత్వీర్ సింగ్ చెప్పాడు.
Read Also: Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..
పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ, హెచ్చరిక జారీ చేయడం తప్ప మరే చర్య తీసుకోలేదని చరత్వీర్ అన్నారు. తన తల్లిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Old helpless mother was beaten up by the daughter in law in Gurdaspur . Sou Moto was issued immediately and strict action will be taken.
Elder’s safety , their rights and protection is commission’s priority. #RespectElders #Families #WomenSafety #PSWC #Punjab pic.twitter.com/ZCFhoDH45Q— Raj Gill (@rajlali) October 1, 2025