Site icon NTV Telugu

Doctor Death Case: మచిలీపట్నం డాక్టర్ రాధ హత్య కేసులో కీలక పురోగతి

Doctor

Doctor

Doctor Death Case: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య డాక్టర్ రాధ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. జవ్వారుపేటకు చెందినడాక్టర్ రాధను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన కేసులో కీలక పురోగతి లభించింది. హత్య చేసిన తర్వాత ఆమె వంటిపై ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. ఇదిలా ఉండగా.. డాక్టర్ రాధను భర్త డాక్టర్ మహేశ్వర రావు హత్య చేయించినట్లుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. డ్రైవర్‌కు సుపారీ ఇచ్చి భార్యను హత్య చేయించినట్లు దాదాపు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలుస్తోంది.

Also Read:Rakul Preeth Singh: లోదుస్తులు లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ట్రీట్..

అనుమానం రాకుండా నిందితులు కారం చల్లినట్లు తెలిసింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. భర్తే భార్యను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

గత నెల 25న డాక్టర్ రాధ ఇంట్లోనే హత్యకు గురైంది. రాధ తలపై సుత్తితో కొట్టి అనంతరం గొంతుకోసి హత్య చేశారు. మచిలీపట్నంలో డాక్టర్ రాధ, డాక్టర్ మహేశ్వర రావు వెంకటేశ్వర పిల్లల ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. పోలీసులు నిందితులను రేపు మీడియా ముందుకు తీసుకురానున్నారు. మీడియా సమావేశంలో కేసు వివరాలన తెలపనున్నారు.

Exit mobile version