Gyanesh Kumar and Sukhbir Singh Sandhu: కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా (Election Commissioners) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ ( Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)లను ప్రధాని మోడీ కమిటీ నిన్న ( గురువారం ) నియమించింది. అయితే, తాజాగా వీరు ఈసీఐలో జాయిన్ అయ్యారు. కమిషనర్లుగా ఇవాళ (శుక్రవారం) ఉదయం అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిషనర్‌గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేశారు.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవలే అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకాన్ని గురువారం నాడు ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ సుఖ్‌బీర్ సింగ్ సింధూ, జ్ఞానేశ్ కుమార్‌లను ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలను చేపట్టారు.
Read Also: Anasuya : కుల్ఫీతో అనసూయ క్యూట్ సెల్ఫీ.. ఆడుకుంటున్నారుగా..!
ఇక, ఈ ఇద్దరూ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కేరళ రాష్ట్రానికి చెందిన జ్ఞానేశ్ కుమార్, ఉత్తరాఖండ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధూ.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో జ్ఞానేశ్ కుమార్ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించారు.. సుశ్ బీర్ సింగ్ గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. కాగా, ఎన్నికల కమిషనర్ల ప్రకియపై ఎంపిక కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరీ వీరి ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సుప్రీంలో నేడు విచారణ జరగబోతుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ల నియామక కమిటీ నుంచి సీజేఐని తప్పించి ఆ స్థా నంలో క్యాబినెట్ మంత్రిని చేర్చటాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు నమోదు అయ్యాయి.
Two newly-appointed Election Commissioners, Gyanesh Kumar and Dr Sukhbir Singh Sandhu joined the Commission today: ECI pic.twitter.com/N5ZXd4RxQQ
— ANI (@ANI) March 15, 2024