NTV Telugu Site icon

GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా

Gvmc

Gvmc

GVMC Standing Committee Elections: విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. పదికి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీకి చెందిన కార్పొరేటర్లు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఫలితాల్లో 10 స్థానాలను టీడీపీ దక్కించుకోగా.. జీవీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. 10స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు హంగామా చేశారు.

Read Also: CM Chandrababu: చేనేత దినోత్సవం.. సతీమణి కోసం స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబు

అంతకు ముందు కౌంటింగ్‌పై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్‌పై పెన్సిల్‌తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

Show comments