NTV Telugu Site icon

GVL Narasimha Rao: ఇప్పటికీ మేము జనసేనతో పొత్తులోనే ఉన్నాం..

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. అయితే.. ఈ పొత్తు ఎన్నికల వరకు ఉంటుందా.. జనసేన టీడీపీతో కలిసి సవారీ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ జీవీఎల్ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు.ఏపీలో ల్యాండ్, ఇసుక స్కాములు జరుగుతున్నాయని జీవీఎల్ ఆరోపించారు. ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే విధంగా బీజేపీ పని చేస్తుందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

Also Read: Komatireddy Venkat Reddy: మంత్రి జగదీశ్‌కి వెంకటరెడ్డి సవాల్.. చేయగలవా?

శనివారం నిర్వహించిన సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే నడ్డా చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు జీవీఎల్‌ నరసింహారావు సవాల్‌ విసిరారు. ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే గత ప్రభుత్వానికి సర్టిఫికెట్‌లు ఇచ్చినట్లు కాదన్నారు. సాధారణ ప్రజలు ఏపీలో జరిగిన స్కాంల గురించి గమనిస్తున్నారన్నారన్నారు.