శాసన సభ సమావేశాలు- నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల పై సమీక్ష చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా, సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు త్వరితగతిన అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.
Manju Warrier: మాజీ భర్త పేరు పలకడానికి కూడా ఇష్టపడని హీరోయిన్..
భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోండి, సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీ ల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు చేపట్టాలని సూచించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పట్లు ఆయా విభాగాల అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలను ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని, గతంలో ప్రోటోకాల్ విషయంలో తాను కూడా బాధితుడిని అని మంత్రి గుర్తు చేసుకున్నారు. మండలిని అసెంబ్లీ ప్రాంగణంలో కు త్వరితగతిన షిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.. సమస్యలుంటే వెంటనే పరిష్కారం చెయ్యాలని చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ ని మంత్రి ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Duddilla Sridhar Babu : పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం
