Site icon NTV Telugu

Gutha Sukender Reddy : సోనియా గాంధీ ఎప్పటికైనా తెలంగాణకు దేవతే..

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy : పెహల్గం ఘటన తర్వాత దేశ ప్రజల అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. యుద్ధం కంటే ఉగ్రవాద నిర్మూలన చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

Gold Rates: గోల్డ్ లవర్స్ కు పండగే.. రూ. 2 వేలు తగ్గిన తులం బంగారం ధర

కేసీఆర్ కాంగ్రెస్‌ను తెలంగాణకు విలన్‌గా అభివర్ణించడం అర్థరహితమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని, ఉద్యమ నాయకుడు కాబట్టే 2014లో బీఆర్ఎస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారని ఆయన తెలిపారు. సోనియా గాంధీ ఎప్పటికీ తెలంగాణకు దేవతలాంటి వారని ఆయన అన్నారు.

జనగణనతో పాటు కుల గణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. తెలంగాణలో చేసిన కుల గణన దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం చట్టాలను, రాజ్యాంగాన్ని వివిధ రాష్ట్రాల్లో తమ ఇష్టానుసారం అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. జిల్లాలో, రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో SLBC తప్పకుండా పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Guntur: పేరేచర్ల కొండల్లో వ్యక్తి దారుణ హత్య.. వీడియో వైరల్‌తో వెలుగులోకి ఘటన

Exit mobile version