Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్

Ananya Agarwal

Ananya Agarwal

Ananya Agarwal: ఓ వైపు కాలేజీ చదువులు, అసైన్‌మెంట్లు, ఎగ్జామ్స్.. మరోవైపు సొంతంగా కేఫ్ (Cafe) బిజినెస్! సాధారణంగా 21 ఏళ్ల వయసున్న స్టూడెంట్స్ అంతా తమ ఫస్ట్ జాబ్, కెరీర్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ అనన్య అగర్వాల్ (Ananya Agarwal) మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఆలోచించి సక్సెస్ సాధించింది. గురుగ్రామ్‌లో (Gurugram) కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ (Rs 15 Lakh Revenue) రాబట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది.

బ్యాచిలర్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (Bachelor’s degree in Management Studies) చివరి సంవత్సరం చదువుతున్న అనన్య, గురుగ్రామ్‌లో ‘లూమ్ & లైమ్’ (Lume & Lime) పేరుతో ఒక ప్యూర్ వెజిటేరియన్ బిస్ట్రో (Vegetarian Bistro) ప్రారంభించింది. కాలేజీ క్లాసులు వింటూనే ఈ బిజినెస్ రన్ చేయడం ఆమెకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయినా సక్సెస్ సాధించింది. మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్ చదువుతుండటం వల్ల థియరీతో పాటు ప్రాక్టికల్ అనుభవం కూడా లభిస్తోందని ఆమె అంటోంది. ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ.. రెండు వైపులా మేనేజ్ చేయడం కష్టమే అయినా, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ (Entrepreneurship) అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.

సాధారణంగా మన దగ్గర దొరికే ఇటాలియన్ (Italian), మెక్సికన్ (Mexican), లేదా మెడిటరేనియన్ (Mediterranean) ఫుడ్‌లో చాలావరకు ఇండియన్ స్పైసెస్ (Indian Spices) కలిపి ‘ఇండియనైజ్డ్’ (Indianised) చేసేస్తుంటారు. దానివల్ల ఆ వంటకాల ఒరిజినల్ టేస్ట్ మారిపోతుంది. కానీ తమ కేఫ్‌లో అలా కాకుండా, ఒరిజినల్ ఫ్లేవర్స్ (Authentic Flavours) మిస్ కాకుండా అందించాలనే ఆలోచనతోనే ఈ కేఫ్ స్టార్ట్ చేసినట్లు అనన్య చెప్పింది. కేవలం తిని వెళ్లడమే కాకుండా, కస్టమర్లు కాసేపు ప్రశాంతంగా సమయం గడిపేలా మంచి అట్మాస్ఫియర్ (Ambience) క్రియేట్ చేసింది.

ఈ బిజినెస్ జర్నీలో (Business Journey) అనన్య ఒంటరి కాదు. తన తల్లిదండ్రులు డాక్టర్ విశాల్ అగర్వాల్ (Dr Vishal Agrawal), ప్రీతి అగర్వాల్‌లతో (Preeti Agrawal) కలిసి కో-ఫౌండర్‌గా (Co-founder) ఈ కేఫ్ స్టార్ట్ చేసింది. తన తండ్రికి ఉన్న దశాబ్దకాలపు బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఆమెకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బ్రాండ్ డిస్కషన్స్ (Brand Discussions), బిజినెస్ మీటింగ్స్, హాస్పిటాలిటీ (Hospitality) రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలో సొంతంగా నేర్చుకుంటోంది.

ఇక లూమ్ & లైమ్ కేఫ్ మెనూ (Menu) విషయానికి వస్తే.. ఇటాలియన్, మెక్సికన్, మెడిటరేనియన్ డిషెస్ దొరుకుతాయి. బ్రిక్-ఓవెన్ పిజ్జాలు (Brick-oven Pizzas), హ్యాండ్‌మేడ్ పాస్తా (Handmade Pastas), టాకోస్ (Tacos), మెజ్జే ప్లాటర్స్ (Mezze Platters) తో పాటు స్పెషాలిటీ బ్రెడ్స్ (Specialty Breads), వెరైటీ ఫ్రైస్ (Fries) ఇక్కడ స్పెషల్. వీటితో పాటు స్పెషాలిటీ కాఫీ (Specialty Coffee), డెజర్ట్స్ (Desserts), అలాగే వీగన్ ఆప్షన్స్ (Vegan Options) కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కేఫ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక, స్టూడెంట్ లైఫ్‌లోనే ఒక వైపు డిగ్రీ పూర్తి చేస్తూ, మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ నడుపుతూ దూసుకుపోతున్న అనన్య, ఈనాటి యువత, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్లకు (Young Entrepreneurs) ఒక మంచి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది.