Site icon NTV Telugu

Gurpatwant Singh: అయోధ్య రామ మందిరంపై గురుపత్వంత్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు..

Pannun

Pannun

Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ మరోసారి భారత్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు అమృత్‌సర్‌ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు అన్ని మూసివేయాలని పిలుపునిచ్చాడు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సైతం రామ మందిరాన్ని ముస్లింలు వ్యతిరేకించాలని గురుపత్వంత్‌ సింగ్‌ ఇవాళ వీడియో రిలీజ్‌ చేశాడు. దీంతో భారత్‌ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: Amitabh Bachchan: మా ఆత్మగౌరవాన్ని తగ్గించొద్దు.. లక్షద్వీప్‌కు సపోర్ట్ గా బిగ్ బీ..

ఇక, అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరుగుతుందని.. దీన్నీ తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలు చేసింది. పన్నూన్‌ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్‌ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందని యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.. అయితే, నిఖిల్ గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపలు చేసింది. అయితే, గుప్తాను చెక్ రిపబ్లిక్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version