Pemmasani Chandrashekar: టీడీపీకి కంచు కవచంలా నిలబడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pemmasani Chandrashekar: ‘టీడీపీని వైసీపీ అధినేత తక్కువ అంచనా వేశారు. మీరు కాదు కదా, మీ ముని మనవడు కూడా టచ్ చేయలేరు. టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌కు, కంచు కవచంలా అడ్డం నిలబడతాం.’ అని అధికార పార్టీపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌తో పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం దామరపల్లి, పొన్నెకల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు. దారి పొడవున గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతం పలకగా.. పలు కూడళ్ళలో ఎక్స్‌కావేటర్ల సహాయంతో భారీ గజమాలతో ప్రజలు తమ ఊళ్ళలోకి ఆహ్వానించారు. కాగా అనంతరం పొన్నెకల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు.
Read Also: YSRCP vs TDP: ఒంగోలులో టెన్షన్ టెన్షన్.. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఎంతోమంది నాయకులు, పెద్దల వద్దకు వెళ్లి పరిశ్రమలు, ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లు వంటి 120 సంస్థలను తీసుకువచ్చారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమానంగా జరిగిన రోజే ప్రజాస్వామ్యంలో ప్రజలు గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలరని తెలిపారు. కన్స్ట్రక్షన్ కావాలి – డిస్ట్రక్షన్ కాదు, మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, అరాచకం కాదని ఆయన అన్నారు. జగన్ ముని మనవడు వచ్చినా టీడీపీని, చంద్రబాబును, లోకేష్‌ను టచ్ చేయలేరన్నారు. “ఒక్కసారి ప్రజలంతా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోండి. మంచి నాయకత్వానికి ఓటేసి అమరావతిని నిలబెట్టుకోవాలి.’ అని తాడికొండ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు టీడీపీ, బీజేపీ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి డాక్టర్ పెమ్మసాని, శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విజయ్ శేఖర్, టీడీపీ నాయకులు డాక్టర్ శేషయ్య, అలాగే మండల నియోజకవర్గస్థాయి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!