సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీ గా వున్నారు.మాటల మాంత్రికుడు త్త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో లో యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి..ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ మరియు గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇక ఈ సినిమా ను జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తున్నారు మేకర్స్ .
ఇక ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ కోసం అభిమానులనంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదల చేసారు మేకర్స్ . అయితే ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ సినిమా లో శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుందని సమాచారం.ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. మహేష్ బాబు సరసన కాజాల్ అగర్వాల్ బిజినెస్ మ్యాన్ మరియు బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ సినిమా నటించనుందని తెలుస్తోంది. గుంటూరు కారం లో కాజల్ అగర్వాల్ చాలా చిన్న పాత్రలో నటిస్తుందని సమాచారం.ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమా లో నటిస్తుంది.గుంటూరు కారం సినిమాలో కాజల్ నటిస్తున్న విషయం త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.