NTV Telugu Site icon

Gundu Sudha Rani: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన గుండు సుధారాణి

Rk

Rk

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు. తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి హస్తం కండువా కప్పుకున్నారు. కొద్ది రోజులుగా ఆమె పార్టీ వీడనుందన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఊతమిస్తూ ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఆమె పాల్గొనలేదు. పర్యటన సందర్భంగా కేటీఆర్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫొటో కనిపించలేదు. సభకు సైతం హాజరుకాలేదు. గత కొన్ని రోజుల ముందు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి మాట్లాడారు. ఇక ఈ పరిణామాలన్నీ ఆమె కాంగ్రెస్ బాట పడుతున్నారు అన్న అంశాన్ని బలపరిచాయి.

READ NORE: Salman Khan Firing: షాకింగ్: కాల్పుల కేసులో మరో ఇద్దరి అరెస్టు?

ఈ రోజు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగ్గారెడ్డి మరియు కోదండ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ కానుంది. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్న గుండు సుధారాణిని కొండా సురేఖ దంపతులు రాకుండా అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ కొండా సురేఖ దంపతులతో సఖ్యత ఉన్నట్లయితే గుండు సుధారాణి వారి సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకునేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా కొడుతున్న దెబ్బలతో బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్టు కేటాయించింది. ఇప్పుడు వారికి సుధారాణి తోడవటంతో కాంగ్రెస్ అభ్యర్థికి బలం చేకూరనుంది.

Show comments