Gulzar House Fire Incident: దాని వల్లే గుల్జార్ హౌస్ ప్రమాదం.. నిర్ధారించిన అధికారులు..!
- గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.
- భవనంలో మొత్తం 14 ఏసీలు
- ఏసీ యూనిట్‌లోని కంప్రెసర్ పేలినట్లు నిర్ధారించిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulzar House Fire Incident: హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ భవనంలో సంభవించిన ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఇప్పటికే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే క్లూస్, ఫోరెన్సిక్ టీంలు ఘటన స్థలానికి చేరుకుని ఇంటి లోపలికి వెళ్లి విచారణ చేపట్టాయి. భవనంలో ప్రమాదానికి గల అసలు కారణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో అధికారులు కీలక వివరాలను కనుగొన్నారు.
Read Also: Tata Harrier EV: కిరాక్ లుక్‌లో జూన్ 3న లాంచ్‌కు సిద్దమైన టాటా హారియర్ EV..!
Also Read
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
అధికారుల వివరాల ప్రకారం, గుల్జార్ హౌస్ భవనంలో మొత్తం 14 ఏసీలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఏదో ఏసీ యూనిట్‌లోని కంప్రెసర్ ఒక్కసారిగా పేలినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ పేలుడు తీవ్రమైన అగ్ని ప్రమాదానికి దారితీసిందని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం మొత్తం తునా తునకలైనట్లు వెల్లడించారు. గ్రౌండ్ ప్లస్ టూ అంతస్తులతో నిర్మించిన భవనం మొత్తం ప్రమాదంతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మూడంతస్తుల భవనంలోని వస్తువులు అన్నీ పనికి రాకుండా పోయాయి. గోడలన్నీ పగిలిపోయినట్లుగా, ఫ్లోర్లలో వేడి ప్రభావంతో బీటలు పడినట్లుగా గుర్తించారు. అలాగే టైల్స్, మార్బుల్స్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Monsoon: గుడ్‌న్యూస్.. 4 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఈ ప్రమాదం నేపథ్యంలో భవన నిర్మాణ నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంప్రెసర్ పేలుడు ఎంత తీవ్రమైనా, భవనం అంతటి స్థాయిలో ధ్వంసం కావడం వెనుక నిర్మాణంలో లోపాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి నివేదిక కోరింది.
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!