Gujarat Titans Players: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే కీలక పోరుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) ఆటగాళ్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. ముఖ్యంగా జట్టు స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాలలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ అభిమాని షేర్ చేసిన వీడియోలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాల సమీపంలోని ఓ నదిలో స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. కీలక మ్యాచ్‌కు ముందు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇలా ప్రకృతి మధ్య మమేకమయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల అందమైన కొండలు, చల్లని వాతావరణం, ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి చెందింది. ప్లేఆఫ్స్ కోసం అక్కడికి చేరుకున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ల మధ్యలో ప్రాంతీయ అందాలను ఆస్వాదిస్తున్నట్లు కనపడుతోంది.
ఇదిలా ఉండగా, గుజరాత్ టైటాన్స్-ఆర్సీబీ మధ్య జరగనున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండటంతో రెండు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఆర్సీబీ రెండో ఐపీఎల్ టైటిల్ దిశగా మరో అడుగు వేస్తుందా.? లేక గుజరాత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా.. అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
