NTV Telugu Site icon

Gujarath: గుజరాత్‌లో ఉదయం 9 గంటల వరకు 9.87% ఓటింగ్ నమోదు

Zero Voting

Zero Voting

గుజరాత్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా తరచుగా ప్రశంసిస్తుంటారు. 2019లో దాని అద్భుత విజయం సాధించి మరోసారి ప్రతిభ చాటింది. ఇక్కడ అది వరుసగా రెండవసారి మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న మూడో ఫేస్ ఓటింగ్ కొనసాగుతోంది. గుజరాత్‌లో ఉదయం 9 గంటల వరకు 9.87% ఓటింగ్ నమోదైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.

READ MORE: KCR: నేడు మెదక్ లో కేసీఆర్ బస్సు యాత్ర..

గుజరాత్ లో బీజేపీ ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు ఎంపీ స్థానాల్లో బరిలో నిలవగా.. మిగిలిన 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ రెండు పార్టీలు కలిసి పని చేయడం ఇది మొదటి సారి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని 26 స్థానాలను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఈ సారి కూడా గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ ఈ సారి కూడా మొత్తం స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. దాంట్లో భాగంగా రెండవ అభ్యర్థుల జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కేటాయించలేదు.