NTV Telugu Site icon

PM Narendra Modi: గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపే.. హిమాచల్‌లో ఒక్క శాతం ఓట్లతోనే..

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా, కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్‌నాథ్ సింగ్‌ పాల్గొన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామని ప్రధాని స్పష్టం చేశారు. గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటిందన్నారు. హిమాచల్‌లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్‌ చేశాయని తెలిపారు. హిమాచల్‌ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

Election Results 2022: గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. హిమాచల్‌లో కాంగ్రెస్‌దే పీఠం

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. ఏ పోల్ బూత్‌లోనూ రీపోలింగ్ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్ ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఒకశాతం ఓట్లతో బీజేపీ రెండోస్థానంలో ఉందన్నారు. గుజరాత్ చరిత్రలో బీజేపీకి అతిపెద్ద విజయం నేపథ్యంలో చాలా రికార్డులను కమలం పార్టీ బద్దలు కొట్టిందన్నారు. దేశం ముందు సవాలు ఎదురైనప్పుడల్లా ప్రజలు బీజేపీపై విశ్వాసం చూపిస్తారని గుజరాత్‌ ఫలితాలు రుజువుచేశాయన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతిపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.