Site icon NTV Telugu

Gujarat Morbi Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 9మంది అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం

Morbi

Morbi

Gujarat Morbi Bridge: గుజరాత్ మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. దాదాపు 141మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. నదిలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఘటనకు కారకులుగా భావిస్తోన్న తొమ్మదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, సెక్యూరిటీ, టికెట్ కలెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిర్వహణకు సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపించారు. దీంతో అక్కడ వంతెనను నిర్మిస్తున్న కంపెనీపై నేరపూరిత హత్య కేసు నమోదు చేశారు. ఐజీనీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.

Read Also: Boy Killed Snake: నన్నే కాటేస్తావా..కొరికి చంపుతా.. పాముపై కోపంతో బాలుడు ఏంచేశాడంటే..

‘ఇది ఇలా ఉండగా.. గుజరాత్ మోర్బీ బ్రిడ్జీ ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.’

Read Also: NCP Cheif Shard pawar hospitalized : శరద్ పవార్‎కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు

గుజరాత్‌ బ్రిడ్జి ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది మరణించగా.. 177 మందిని రక్షించారు. నదిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయ, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా మంది మోర్బి నివాసితులు ప్రజలను రక్షించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నారు. రక్తదానం చేసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. రక్తదానం చేసేందుకు వస్తున్నవారితో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి.

Exit mobile version