దేశంలో ఒక పెద్ద ఉగ్రవాద ఆపరేషన్‌ను భగ్నం చేసినట్లు గుజరాత్ ATS ప్రకటించింది. చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ATS అరెస్టు చేసింది. రహస్య సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగిందని ATS DIG పేర్కొన్నారు. గుజరాత్ ATS, కేంద్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా భారీ పురోగతి సాధించాయి. ఈ ఉగ్రవాదులలో చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన 35 ఏళ్ల వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు. అతను ISKPతో అనుబంధంగా ఉన్న విదేశాలలో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. అహ్మద్‌తో పాటు, అతని ఇద్దరు సహచరులు మొహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫీలను కూడా అరెస్టు చేశారు. ATS ప్రకారం, ఈ ముగ్గురు అహ్మదాబాద్, లక్నో మరియు ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తు్న్నట్లు తెలిపారు.
Also Read:AI సౌండ్ ఫోకస్, LUMO ఇమేజ్ ఇంజిన్‌తో భారత్‌లో OPPO Find X9, Find X9 Pro నవంబర్ 18న విడుదల!
ముగ్గురు ఉగ్రవాదులను ఒక సంవత్సరం పాటు నిఘాలో ఉంచినట్లు గుజరాత్ ATS పేర్కొంది. వారి లొకేషన్ ను నిరంతరం ట్రాక్ చేసి వారి ప్రతి కదలికను పరిశీలించారు. టెర్రరిస్టులు భయంకరమైన ISIS విభాగం, ISKP (ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్) తో అనుసంధానించబడిన రెండు వేర్వేరు మాడ్యూళ్లలో భాగమని గుర్తించారు. గుజరాత్ ATS DIG సునీల్ జోషి ప్రకారం, చాలా నెలలుగా, హైదరాబాద్ నివాసి అయిన 35 ఏళ్ల అహ్మద్ మొహియుద్దీన్ గురించి సమాచారం అందింది, అతను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని దీని ఆధారంగా, ATS అతని ప్రతి కదలికను పర్యవేక్షిస్తోందని తెలిపారు.
రెండు రోజుల క్రితం అహ్మద్‌ను అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ఆయుధాలు, ద్రవ రసాయనాన్ని కారులో తీసుకెళ్తుండగా ATS అరెస్టు చేసింది. విచారణలో, అతను విదేశాలలో ఉన్న ISKP సభ్యులతో పరిచయం కలిగి ఉన్నాడని వెల్లడైంది. అతను మరో ఇద్దరు రాడికలైజ్డ్ యువకులు మొహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫీలతో ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలలో గ్రౌండ్ నిఘా నిర్వహించి దాడులకు ప్లా్న్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:Sourav Ganguly: ‘రిచా ఘోష్ భారత కెప్టెన్’.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ATS ప్రకారం, ముగ్గురు ఉగ్రవాదులు “రైజిన్” అనే అత్యంత విషపూరితమైన ద్రవాన్ని తయారు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, ఈ పదార్ధం సైనైడ్ కంటే ప్రాణాంతకం. తక్కువ మొత్తంలో కూడా విస్తృత ప్రాణనష్టం జరగవచ్చు. ఈ మాడ్యూల్ ఈ ద్రవాన్ని ఎలా ఉపయోగించాలనుకుంటుందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో, అహ్మద్ ఆయుధాలను రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.
వాటిని సరఫరా చేయడానికి గుజరాత్‌కు వచ్చానని, డెలివరీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లబోతున్నాడని చెప్పాడు. ఆయుధాలు సరఫరా నెట్‌వర్క్‌లోకి ప్రవేశించిన మార్గాలను, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో ATS దర్యాప్తు చేస్తోంది. వర్గాల సమాచారం ప్రకారం, ముగ్గురు ఉగ్రవాదులు ఒక సంవత్సరానికి పైగా ATS రాడార్‌లో ఉన్నారు. గుజరాత్‌లో వారి ఆయుధ మార్పిడి గురించి సమాచారం అందిన వెంటనే, ATS వెంటనే ఆపరేషన్ ప్రారంభించి ముగ్గురిని అరెస్టు చేసింది. దర్యాప్తులో కేంద్ర సంస్థలు కూడా పాల్గొన్నాయి.