Guinness World Record: అమెరికాలోని న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే రికార్డు సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న మెగా యోగా డే ఈవెంట్.. ఏకంగా గిన్నిర్ రికార్డుల్లోకి ఎక్కింది. అత్యధిక దేశాల పౌరులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. గిన్నిస్ బుక్ నిర్వాహకులు స్వయంగా, గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు.
Read Also: Government Scheme : బాలికల చదువు కోసం ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో తెలుసా?
న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా డేలో, సందడి సందడిగా గడిపారు ప్రధాని నరేంద్ర మోడీ. వివిధ దేశాల చిన్నారులతో ముచ్చటించారు. యోగాసనాల గురించి వారితో మాట్లాడారు. మొత్తంగా ప్రపంచ అత్యున్నత వేదికపై చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. న్యూయార్క్ లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో, తొమ్మిదవ ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 180 దేశాల ప్రతినిధులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రవాస భారతీయులతో పాటు ఎన్నో దేశాల ప్రజలు యోగాసనాలువ వేశారు. వాళ్లందరి మధ్యలో కూర్చుని యోగా ఆసనాలు వేశారు ప్రధాని నరేంద్ర మోడీ. వసుధైక కుటుంబం కోసం యోగడా థీమ్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ప్రపంచాన్ని యోగా ఏకం చేస్తోందన్నారు ప్రధాని మోడీ.