Site icon NTV Telugu

Gudivada Amarnath: గూగుల్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే లక్ష 80 వేలు ఉద్యోగులు.. ఏపీలో రెండు లక్షలు ఎలా ఇస్తారు..?

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: గూగుల్ డేటా సెంటర్లపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లోకేష్ వ్యక్తిగత విమర్శలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన నన్ను గుడ్డు అంటారు.. నేను పప్పు అంటాను. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఉండదని తెలిపారు.. ఏపీలో గూగుల్‌ రాకను తాము స్వాగతిస్తుమన్నానిచెబితే కూటమి అనుకూల
మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రైడన్ 1గిగా వాట్ డేటా సెంటర్ వల్ల 200మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారని గుర్తు చేశారు…

READ MORE: Preeti Reddy: మేడం సార్.. మేడం అంతే.. డాన్స్ తో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.!

గూగుల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులే లక్ష 80 వేలు అయితే ఒక్క వైజాగ్ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. లక్ష 88 వేల ఉద్యోగాలు వస్తాయని గూగుల్ ప్రకటిస్తే ఒక విశాఖ వ్యక్తిగా లోకేష్‌కు తాను సన్మానం చేస్తానని తెలిపారు.. డేటా సెంటర్లకు పునాదులు వేసింది వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి పేర్కొన్నారు.. ఉద్యోగాలపై క్లారిటీ అడిగితే ట్రోలింగ్ గురించి మాట్లాడతారని.. అసలు ట్రోలింగ్ కు పితామహుడు లోకేష్ అని వ్యాఖ్యానించారు.

READ MORE: Hyderabad Shock: ఎలక్ట్రీషియన్‌తో కలిసి యజమాని ప్లాన్.. అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు, చివరికి..!

“అమెరికాలోని ఎల్ పాసాలో మెటా నిర్మిస్తున్న డేటా సెంటర్ వల్ల 100 – 150 మందికి ఉద్యోగులు వస్తాయి.. డేటా సెంటర్‌కు నిర్మాణ సమయంలో అవసరం అయ్యే మానవ వనరులు 5 వేల లోపే ఉంటాయి. వచ్చే రెండు వందల ఉద్యోగాలకు మీరు చెబుతున్న రెండు లక్షల ఉద్యోగాల ప్రచారానికి మధ్య 950శాతం వ్యత్యాసం ఉంది. ఉద్యోగాల కల్పనపై కూటమి చేస్తున్న ప్రచారాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనేది మా డిమాండ్.. డేటా సెంటర్ల చుట్టూ ఐటీ ఎకో సిస్టం అభివృద్ధి చెందినట్టు స్టడీ ఏదైన ఉంటే బయట పెట్టండి. డేటా సెంటర్ల మీద ప్రచారం చేసుకోండి కానీ ప్రజలనే మోసం చేయవద్దు. లోకేష్ లా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం చేసి కష్టపడి రాజకీయంగా ఎదిగాను.. వ్యక్తిగత చరిత్రలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాట్లాడండి..” అని మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

Exit mobile version