Site icon NTV Telugu

Group -1 Rankers’ Parents: కూటికి గతిలేని మేము రూ.3 కోట్లు పెట్టి పోస్ట్ ఎలా కొంటాం సారూ…

Group

Group

Group -1 Rankers’ Parents: గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ జవాబు చెబుతామంటూ మీడియా సమావేశం నిర్వహించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా పలువురు పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పిల్లలు కష్టపడి సాధించిన విజయాన్ని అపహాస్యం చేసే అసత్య ఆరోపణలపై బాధను వ్యక్తం చేయడానికి మీడియా ముందుకు వచ్చామన్నారు.. కేవలం కృషి, ప్రతిభతో విజయం సాధించిన తమ పిల్లల గౌరవాన్ని దెబ్బతీసిన నిరాధారణమైన ఆరోపణలపై మనోవేదనను వ్యక్తం చేశారు.

READ MORE: Diarrhea Cases: విజయవాడలో తగ్గని డయేరియా కేసులు.. ఇప్పటికే 380కి పైగా..!

గ్రూప్-1 పోస్టులు రూ. 3 కోట్లకు అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఓ గ్రూప్‌-1 ర్యాంకర్ పేరెంట్ మాట్లాడారు. “గ్రూప్‌-1 పోస్టును రూ. 3 కోట్లుకు కొన్నారని మాపై ఆరోపణలు చేశారు. మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా మాకు తెలియదు. మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగం చేయాల్సిన అవసరం మాకు ఏముంది. ఏదో వ్యాపారం చేసుకుని బతకగలుగుతాం. మీమందరం మూడు కోట్ల లంచం ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా..? ఒక్కసారి మమ్మల్ని చూసి ఆలోచించండి. మా పిల్లలకు న్యాయం చేయండి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని హైకోర్టును కూడా విన్నవించుకుంటున్నాం.” అని ఆవేదన వ్యక్తం చేశారు.

READ MORE: Diarrhea Cases: విజయవాడలో తగ్గని డయేరియా కేసులు.. ఇప్పటికే 380కి పైగా..!

“గ్రూప్ 1 ఫలితాలపై ఒక్కొకరు ఒక్కోలా మాట్లాడుతున్నారు.. ఒక్కో పేరెంట్ 3 కోట్ల రూపాయలు పెట్టి పోస్ట్ లు కొన్నారు అని ఆరోపిస్తున్నారు.. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు.. కష్టపడి.. పస్తులుండి.. అప్పులు చేసి పిల్లలను చదివించాం.. సమాజం మా పట్ల చిన్న చూపు చూసే అవకాశం ఉంది.. ఆరోపణలు తిప్పికొట్టకపోతే నిజంగానే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని మీడియా ముందుకు వచ్చాం. రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా.. 3 కోట్లు పెట్టి కొనుక్కున్న ఉద్యోగం అనే నలుగురూ అనుకునే అవకాశం ఉంది.. మీ రాజకీయాలు మీ మధ్యే ఉంచుకోండి.. మీ ఆరోపణలు, ప్రత్యారోపణలు.. నిరుద్యోగులపై రుద్దకండి. దుష్ప్రచారం చేసి.. నిరుద్యోగులను చిన్నచూపు చూసే ఆరోపణలు చేయకండి.. మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి.. వాస్తవాలను బయటపెట్టండి.. రాజకీయాలు చేసి.. మా పిల్లల జీవితాలు నాశనం చేయకండి..” అని మరో పేరెంట్ వాపోయారు.

 

Exit mobile version