Marriage: పెళ్లి కోసం వరుడి పాట్లు.. 28కి.మీ నడిచి వధువు ఇంటికి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage: పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు. ఈ ఘటన ఒడిశాలోని కల్యాణ్ సింగపూర్ బ్లాక్ పరిధిలోని సునాఖండి పంచాయతీలో చోటుచేసుకుంది. సాయంత్రం ఆరు గంటలకు నడక ప్రారంభించిన వీరు.. వేకువజామున మూడు గంటలకు వధువు ఇంటికి చేరుకున్నారు. బుధవారం నుంచి ఒడిశాలోని డ్రైవర్లంతా సమ్మె చేస్తున్న కారణంగా రవాణా సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుడు, అతడి కుటుంబసభ్యులు చేసేదేమీ లేక నడుచుకుంటూ పెళ్లికి వెళ్లారు. వీరంతా రాత్రిసమయంలో నడుస్తూనే వధువు ఇంటికి వెళ్లారు.
రాయగడ జిల్లాలోని కల్యాణ్ సింగ్‌పుర్ బ్లాక్‌లోని సునాఖండి పంచాయతీకి చెందిన రమేష్ అనే యువకుడికి, దిబలపాడుకు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖాయమైంది. శుక్రవారం వధువు ఇంటి వద్ద.. వీరి విహహం జరిగింది. ఈ పెళ్లి కోసం నాలుగు వాహనాలను ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్రంలోని డ్రైవర్లు సమ్మె చేయడం వల్ల.. వాహనాల్లో వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో కాలినడకనే వధువు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సమ్మెతో పెళ్లి కొడుకు తరఫున వారంతా కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
Read Also: Cow Cess: మందుబాబులకు షాక్.. మద్యం అమ్మకాలపై కౌ సెస్..
శుక్రవారం ఉదయం పెళ్లి అనంతరం వరుడి కుటుంబసభ్యులు వధువు ఇంటివద్దే బస చేశారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూశారు. సాయంత్రం డ్రైవర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె ముగిసింది. దీంతో వారి ప్రయాణానికి సుగమమైంది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!