ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఏడాది పొడవునా మార్కెట్ లో లభిస్తాయి అందుకే వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ.. కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు.లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
ద్రాక్ష తీగ జాతి మొక్క దీన్ని మల్లెలో ఎలాగైతే కొమ్మలను కత్తిరిస్తారో అలాగే కత్తిరిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.. కొమ్మల కత్తిరింపుతో ద్రాక్ష త్వరగా కాపుకువస్తుంది. తీగను సరిగా ప్రాకించకపోయినా, కత్తిరించకపోయినా ద్రాక్ష పంట దిగుబడి రాదు. సంవత్సరానికి 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో, శీతాకాలంలో, కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించటం వల్ల ఎక్కువగా కొత్త కొమ్మలు వస్తాయి. ద్రాక్ష గుత్తుల పరిమాణం ,సైజు పెరగాలంటే జిబ్బరిల్లిక్ ఆసిడ్ అను హార్మోన్ ను పైరుపై రెండుసార్లు పిచికారి చేయాలి..
ఈ ద్రాక్ష మొక్కలను పెంచడం ఎంత సులువో కత్తిరింపు విషయంలో కూడా తగు జాగ్రత్తలను తీసుకోవాలి.. అప్పుడే అధిక దిగుబడిని పొందవచ్చు..ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తీయగా ఉన్న గుత్తి కోతకు వచ్చినట్లు గుర్తించవలెను. తెల్లని ద్రాక్ష బాగా తయారైనపుడు అంబర్ రంగులోకి మారుతుంది. అలాగే రంగు ద్రాక్షలాగా రంగువచ్చి పైన బూడిదవంటి పొడితో సమానంగా కప్పబడినట్లుగా కనబడుతుంది. పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి.. అప్పుడే పండ్లు కోతకు సిద్దమని అర్థం.. ఇక ఆ వాతావరణంను బట్టి దిగుబడి కూడా మంచిగానే ఉంటుంది.. ఎకరాకు పది టన్నుల దిగుబడిని పొందవచ్చు.. ఈ పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..