Vadapalli Teppotsavam: వైభవోపేతంగా వెంకన్న తెప్పోత్సవం.. పరవశించిన గోదావరమ్మ!
- వైభవోపేతంగా వెంకన్న తెప్పోత్సవం
- తెప్పోత్సవంతో పరవశించిన గోదావరమ్మ
- ఘనంగా ఏర్పాటుచేసిన ఆలయ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తి, శ్రద్ధల సమ్మేళనంగా తెప్పోత్సవం కొనసాగింది. విశేష పూజలతో పాటు, కన్నుల పండుగగా జరిగింది. వేకువజామున ఆలయ అర్చకుల మేల్కొలుపుతో ప్రారంభమైన ఈ మహోత్సవంలో గౌతమి గోదావరి పవిత్ర జలాలను తెచ్చి స్వామివారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నిత్యార్చన, నిత్య హోమాలు, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం వంటి వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారు అమ్మవార్లకు విశేష పూజారి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది.
సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో అలరించాయి. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రధాన హోమం అనంతరం స్వామివారిని సన్నాయి మేళాల నడుమ గౌతమి గోదావరి తీరం వైపు తీసుకెళ్లి, అంగరంగ వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. నది మధ్యలో సాగిన ఈ తెపోత్సవం భక్తులకు కనుల విందుగా మారి, హృదయాలను భక్తి పరవశంలో ముంచెత్తింది. స్వామివారి కోసం ప్రత్యేకంగా విద్యుత్ పూల అలంకరణలతో రూపొందించిన తెప్ప అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గోదారమ్మ ఒడిలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ పవిత్ర వేడుకల్లో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్‌పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా విశేషమైన ఏర్పాట్లు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు నిర్వహించారు. సమీప ప్రాంతాలు నుంచే కాకుండా సుధీర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఈ కార్యక్రమాలు ఆనందాన్ని, ఉల్లాసాన్ని నింపడంతో పాటు భక్తిని కూడా పెంపొందించాయి. భక్తుల గోవింద నామస్మరణల మధ్య సాగిన ఈ మహోత్సవం కోనసీమ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలిపింది.
తాజావార్తలు
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్‌టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్‌పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్‌లో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!