NTV Telugu Site icon

Cooking Oil: వంట నూనెల దిగుమతిపై కేంద్రం గుడ్ న్యూస్

Cooking Oil

Cooking Oil

Cooking Oil: వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను 2023 మార్చి వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆగస్ట్ 31 నుంచి ఈ రాయితీ దిగుమతి సుంకాలను అమలులోకి తీసుకువచ్చింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఉపశమనాలను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు దిగివస్తున్నాయని అందువల దేశీయ మార్కెట్లో కుకింగ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడంతో పాటు ప్రభుత్వపు సుంకాల రాయితీ వల్ల దేశంలో వంట నూనె ధరలు తగ్గాయని తెలిపింది.

Read Also: BSNL 5G: గుడ్‌న్యూస్‌ చెప్పిన బీఎస్ఎన్‌ఎల్

దేశీ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ సరఫరా పెరగాలని, దీని వల్ల రిటైల్ ధరలు అదుపులో ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గడువును వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సీబీఐసీ తీసుకువచ్చిన రాయితీతో కూడిన దిగుమతి సుంకాలు ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్‌పై 2023 మార్చి వరకు కొనసాగుతాయని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది. ‘వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాలపై రాయితీ ఆరు నెలల పాటు పొడిగించాం. అంటే దీని అర్థం ఇప్పుడు కొత్త గడువు మార్చి 2023 అని ఫుడ్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. క్రూడ్ పామ్ ఆయిల్, ఆర్‌బీడీ పామోలిన్, ఆర్‌బీడీ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇదే కొనసాగుతుంది.

Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియాగాంధీ.

ప్రస్తుతం పామ్ ఆయిల్ క్రూడ్ వెరైటీస్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు లేవు. అయితే అగ్రికల్చర్ సెస్ 5 శాతం, సోషల్ వెల్ఫేర్ సెస్ 10 శాతం వంటివి పరిగణలోకి తీసుకుంటే.. ఈ మూడు క్రూడ్ వెరైటీస్‌పై ఎఫెక్టివ్ దిగుమతి సుంకం 5.5 శాతంగా ఉంటుంది. పామోలీన్, పామ్ ఆయిల్ రిఫైన్డ్ వెరైటీస్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లు కలుపుకుంటే ఈ సుంకం 13.75 శాతానికి చేరుతుంది. రిఫైన్డ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 17.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లను కలుపుకుంటే అప్పుడు ఇది 19.25 శాతానికి చేరుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ధరలకు కళ్లెం వేయడానికి చాలా సార్లు కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది.

Show comments