Cooking Oil: వంట నూనెల దిగుమతిపై కేంద్రం గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cooking Oil: వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను 2023 మార్చి వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆగస్ట్ 31 నుంచి ఈ రాయితీ దిగుమతి సుంకాలను అమలులోకి తీసుకువచ్చింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఉపశమనాలను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు దిగివస్తున్నాయని అందువల దేశీయ మార్కెట్లో కుకింగ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడంతో పాటు ప్రభుత్వపు సుంకాల రాయితీ వల్ల దేశంలో వంట నూనె ధరలు తగ్గాయని తెలిపింది.
Read Also: BSNL 5G: గుడ్‌న్యూస్ చెప్పిన బీఎస్ఎన్‌ఎల్
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
దేశీ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ సరఫరా పెరగాలని, దీని వల్ల రిటైల్ ధరలు అదుపులో ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గడువును వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సీబీఐసీ తీసుకువచ్చిన రాయితీతో కూడిన దిగుమతి సుంకాలు ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్‌పై 2023 మార్చి వరకు కొనసాగుతాయని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది. ‘వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాలపై రాయితీ ఆరు నెలల పాటు పొడిగించాం. అంటే దీని అర్థం ఇప్పుడు కొత్త గడువు మార్చి 2023 అని ఫుడ్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. క్రూడ్ పామ్ ఆయిల్, ఆర్‌బీడీ పామోలిన్, ఆర్‌బీడీ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇదే కొనసాగుతుంది.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియాగాంధీ.
ప్రస్తుతం పామ్ ఆయిల్ క్రూడ్ వెరైటీస్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు లేవు. అయితే అగ్రికల్చర్ సెస్ 5 శాతం, సోషల్ వెల్ఫేర్ సెస్ 10 శాతం వంటివి పరిగణలోకి తీసుకుంటే.. ఈ మూడు క్రూడ్ వెరైటీస్‌పై ఎఫెక్టివ్ దిగుమతి సుంకం 5.5 శాతంగా ఉంటుంది. పామోలీన్, పామ్ ఆయిల్ రిఫైన్డ్ వెరైటీస్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లు కలుపుకుంటే ఈ సుంకం 13.75 శాతానికి చేరుతుంది. రిఫైన్డ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 17.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లను కలుపుకుంటే అప్పుడు ఇది 19.25 శాతానికి చేరుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ధరలకు కళ్లెం వేయడానికి చాలా సార్లు కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?