Site icon NTV Telugu

Tamilisai: పెద్ద పెద్ద మాటల కంటే.. చిన్న చిన్న పనులు గొప్పవి

Governer Tamilisai

Governer Tamilisai

Tamilisai: పెద్ద పెద్ద మాటల కంటే.. చిన్న చిన్న పనులు గొప్పవని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా రాజ్ భవన్ లో జాతీయ జెండాను గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆవిష్కరించారు. అందరికి విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు పీఎం మోడీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు గవర్నర్ తెలిపారు. భారత్ ఇప్పుడు చంద్రుడి పై త్రివర్ణ పతాకాన్ని రెపరేపలాడిస్తోందన్నారు. విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇది మన స్వేచ్ఛ, సమైక్యతకు ప్రతీక అన్నారు.

ఈ హక్కు కోసం ఎందరో నాయకులు జీవితాలు త్యాగం చేశారన్నారు. రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో ముందుకి తీసుకెళ్లడంలో మా వంతు కృషి చేస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎందరో నాయకుల పాత్ర వున్నా…. యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ఎదో ఒక లక్ష్యం పెట్టుకుని యువత ఈ ఏడాదిలో దానిని పూర్తి చేస్తే బావుంటుంది అనుకుంటున్నానని తెలిపారు. రాజ్ భవన్ తరపున ఏడాది పొడవునా సీపీఆర్ శిక్షణ పై అవగాహన కల్పిస్తుందన్నారు. పెద్ద పెద్ద మాటల కంటే … చిన్న చిన్న పనులు గొప్పవని గవర్నర్ తమిళి సై అన్నారు.
Gill-Rohit: అది నేను చేయలేను.. నీకేమైనా పిచ్చి పట్టిందా?! గిల్‌పై రోహిత్ ఫైర్

Exit mobile version