Governor Tamilisai : నేడు బెజవాడ రానున్న తెలంగాణ గవర్నర్ తమిళసై

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

నేడు విజయవాడలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పర్యటించనున్నారు. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ దీనోపాద్యాయ పుస్తక ఆవిష్కరణ లో తమిళ సై పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30కి వచ్చి రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం కానున్నారు. ఇదిలా ఉంటే.. ‘చా­న్స్‌­లర్‌ కనెక్ట్స్‌ అల్యూమినీ’ కార్యక్రమంలో భా­గంగా గవర్నర్‌ తమిళిసై సోమ­వారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు. రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్‌ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు.

Also Read : Ganesh Temple : వినాయకుడికి నైవేద్యంగా నాన్ వెజ్ .. ఎక్కడో తెలుసా?

×
×
Ad

సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో చాలా వర్సిటీల్లో పలు రకాల కోర్సులు మూతబడడం, ఫీజులను అడ్డగోలుగా పెంచడం, తరగతుల నిర్వహణ జరగకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వర్సిటీల్లో గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరగకపోవడం, రాజకీయాలతో వర్సి­టీల పాలన వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తరువాత ఆమె విజయవాడకు బయలు దేరనున్నారు.

Also Read : Suryakumar Yadav Sixes: కెమరూన్‌ గ్రీన్‌కు దడ పుట్టించిన సూర్యకుమార్‌ యాదవ్.. వీడియో చూశారా?