Site icon NTV Telugu

Governor Tamilisai : విద్యార్ధులు ఉద్యోగాన్వేషణేకాదు.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి

Tamilisai On Brs

Tamilisai On Brs

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పదకొండవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందార రాజన్ హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టరేట్ ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ చాన్సలర్ డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ కు అందజేయగా 92,005 మంది పి.హెచ్.డి, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయషన్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు. విద్యాసంవత్సరంలో అధ్భుత ప్రతిభ కనబరిచిన వారికి 46 బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత ప్రతి రోజు అభివృద్ది చెందుతూనే ఉందని దానికి తగినట్లుగా ఇంజినీరింగ్ విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకుని ముందుకు సాగుతూ ఉండాలని అన్నారు. ఒకానొక సందర్భంలో విద్యార్థులు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసేవారని, ఇప్పుడు హాజరైతే చాలు అన్నట్లు ఉండటమే కాకుండా ప్రశ్నపత్రాలు ఎక్కడ తయారవుతాయి కొందరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు.

Also Read : Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కు రంగం సిద్ధం..?

ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఉద్యోగాన్వేషణ పై దృష్టిపెట్టడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, తాము చదువుకున్న చదువులు తమకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు. ఒకప్పుడు విద్యార్థులు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసేవారని, ఇప్పుడు హాజరైతే చాలు అన్నట్లు ఉన్నారన్నారు. ప్రశ్నపత్రాలు ఎక్కడ తయారవుతాయి కొందరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఉద్యోగాన్వేషణ పై దృష్టిపెట్టడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. తాము చదువుకున్న చదువులు తమకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. కస్తూరి రంగన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అన్ని రకాల పారిశ్రామిక అభివృద్ధికి నెలవు అవుతుందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని పైకి ఎదగాలని అన్నారు.

Exit mobile version