Site icon NTV Telugu

Governor Tamilisai : కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను అవమానించారు.. ఎలా అవహేళన చేస్తారు?

Tamilisai

Tamilisai

గవర్నర్ వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ గవర్నర్‌ సంస్థపై ముఖ్యమంత్రులు ఎలా మాట్లాడతారని గవర్నర్‌ ప్రశ్నించారు. ఖమ్మంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ తమిళిసై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం స్పందించారు.

Also Read : Rahul Dravid : అండర్‌ -14 జట్టుకు కెప్టెన్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ కుమారుడు.. వావ్‌

ముఖ్యంగా గత ఏడాది కాలంగా ప్రొటోకాల్‌ను పాటించకుండా గవర్నర్‌ సంస్థను ముఖ్యమంత్రి అవమానించారని తెలంగాణ ప్రభుత్వం, సీఎం కె. చంద్రశేఖర్‌రావుపై ఆమె విమర్శలు గుప్పించారు. తన 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రోటోకాల్ గురించి తనకు బాగా తెలుసని, అనుసరించాల్సిన ప్రోటోకాల్‌కు సంబంధించిన తన ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్పందించిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని ఆమె అన్నారు. రిపబ్లిక్ డే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదని, గణతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాలు రానున్నాయి ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో మీరు చూస్తారుగా.! అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Also Read : LIC Jeevan Arogya Policy : ఈ కార్డు ఉంటే.. హాస్పిటల్ బిల్ కట్టే పనేలేదు

Exit mobile version