Site icon NTV Telugu

Governor Abdul Nazeer: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది!

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సహా మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు.హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన అధికారిక వేడుకల్లో గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కర్నూల్ ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌తో పాటు వివిధ భద్రతా దళాల నుంచి గవర్నర్‌కు అధికారిక గౌరవ వందనం అందింది.

రిపబ్లిక్ డే వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం పది సూత్రాల అమలుతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. సామాజిక పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందది. ప్రస్తుతం రాష్ట్రంలో 63 లక్షల మందికి పైగా అర్హులైన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. దీపం పథకం ద్వారా పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందిస్తూ మహిళలకు ఉపశమనం కల్పిస్తున్నాం. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాంరు. పాపులేషన్ మేనేజ్మెంట్ అంశంపై కూడా ప్రభుత్వం గమనాన్ని పెంచింది’ అని గవర్నర్ స్పష్టం చేశారు.

‘నీటి భద్రత ప్రభుత్వ ప్రధాన విధానాల్లో ఒకటి. పోలవరం ప్రాజెక్ట్తో పాటు రాష్ట్రంలోని అన్ని కీలక సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలవరం, నల్లమల్లసాగర్ వంటి ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాము. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. పొలం పిలుస్తోంది, రైతన్న మీ కోసం వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు నేరుగా మద్దతు అందిస్తున్నాము. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రవాణా రంగంలోనూ ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోంది. రోడ్డు, రైల్వేతో పాటు జల రవాణాకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నాము. గత ప్రభుత్వం రవాణా మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసింది, ప్రస్తుతం ఆ లోటును పూడ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాము’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు.

Also Read: Team India History: నీ యవ్వ తగ్గేదేలే.. టీ20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర!

‘రాజధాని అభివృద్ధితో పాటు విశాఖను ఎకనామిక్ జోన్ గా ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారి విద్యుత్తు శాఖలో ట్రూ డౌన్ చార్జెస్ అమలు చేసి వినియోగదారులపై భారం ప్రభుత్వం తగ్గించింది. పీఎం కుసుమ కార్యక్రమంలో 3 లక్షల పంపు సెట్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఫోకస్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహంతో పాటు ప్లగ్ అండ్ ప్లే విధానంలో ముందుకు వెళ్తున్నాం. ఏపీ టూరిజం పాలసీ 2024-29 అమలు చేసి టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాము. స్వచ్ఛ ఆంధ్ర..సేఫ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అమరావతి క్వామ్ టమ్ వ్యాలి త్వరలో ప్రారంభం చేస్తున్నాం. ఏఐ టెక్నాలజిపై ప్రత్యేక దృష్టి పెట్టాము. ప్రతి సవాల్ ఎదుర్కొంటు ముందుకు వెళ్తున్నాం. 2047 స్వర్ణ ఆంధ్ర విజన్తో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రిపబ్లిక్ డే ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version