NTV Telugu Site icon

Aadi Srinivas: అల్లు అర్జున్‌లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు..

Aadi Srinivas

Aadi Srinivas

Aadi Srinivas made strong comments on Allu Arjun: అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్‌లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు.. రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావన పైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని ఆది శ్రీనివాస్ అన్నారు. తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయారని అల్లు అర్జున్‌కి పోలీసులు చెప్పిన తర్వాత థియేటర్‌లో షో చేశారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్.. సమాజంలో నీ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూడు అని అన్నారు.  

Read Also: AUS vs IND: గబ్బాలో పోరాటం.. ఆకాశ్ దీప్‌ ఆసక్తికర విషయాలు!

వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి.. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచన లేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. నీ పేరు ప్రతిష్టలు అవతలి వారు ప్రాణాల కంటే ఎక్కువా..? అని దుయ్యబట్టారు. అల్లు అర్జున్ ఇంకా దబాయించి మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. సీఎం అసెంబ్లీలో పోలీసులు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ఇచ్చారు.. అల్లు అరవింద్ మాట్లాతున్న తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. తన కొడుకు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నాడు.. అల్లు అరవింద్ గారు.. అవతల ఒక ప్రాణం ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని అన్నారు. అల్లు అర్జున్ తీరు పైన తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read Also: Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్