తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ వాడివేడిగా సాగనున్నది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ లోపల.. బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రభుత్వ బిల్లులపై చర్చ కొనసాగనున్నది. మొదట పంచాయతీ రాజ్.. మున్సిపల్ సవరణ బిల్లులు.. తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదిక పై చర్చ జరుగనుంది. “కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమీషన్ నివేదిక” పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
Also Read:Trump: భారత్ పై కఠినమైన ఆంక్షలు విధించండి.. యూరోపియన్ దేశాలపై అమెరికా ఒత్తిడి
సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన పై కటినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్పీకర్ పోడియం కి వస్తే వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ఒకరిద్దరు ఎమ్ఎల్యేల తీరుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించబోతుంది అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం కమిషన్ సీబీఐ కి ఇస్తుందా..? సిట్ విచారణ అనేది తేలిపోతుంది. సీబీఐ కి ఇవ్వాలని ప్రభుత్వంకు ఇద్దరు కీలక మంత్రులు సూచించినట్లు సమాచారం. అసెంబ్లీ లో మూడు బిల్లులు ప్రవేశ పెట్టనున్నది ప్రభుత్వం.
1. 2025, తెలంగాణ పురపాలక సంఘాల (మూడవ సవరణ) బిల్లు.
2. 2025, తెలంగాణ పంచాయితీరాజ్ (మూడవ సవరణ) బిల్లు.
3. 2025, తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల (రిజిస్ట్రికరణ, క్రమబద్ధీకరణ) చట్టమును రద్దు చేయుటకైన బిల్లు.
“కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమీషన్ నివేదిక” పై స్వల్పకాలిక చర్చ.
