Site icon NTV Telugu

Crime News: మదనపల్లెలో దారుణం.. తండ్రిని హత్య చేసిన కూతురు!

Crime

Crime

Crime News: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో తండ్రిని కన్నకూతురే కడతేర్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామిని కుమార్తె హరిత హత్య చేసినట్లు తెలిసింది. తన ఇంట్లో మిద్దెపైన గదిలో ఈ ఘటన జరిగింది. దొరస్వామి తలపై పదునైనా ఆయుధంతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకుని వన్ టౌన్, తాలూకా సీఐలు వల్లిబషు, శేఖర్ విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

Read Also: Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు

దొరస్వామి దిగువ కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భార్య మృతిచెందడంతో కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె హరితను పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version